ఈ ఆహారం బలవర్థకం!

ABN , First Publish Date - 2021-05-04T05:30:00+05:30 IST

కొవిడ్‌ బారిన పడినవాళ్లు త్వరగా కోలుకోవాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! ఇందుకోసం ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రిజుతా దివేకర్‌ కొన్ని ఆహార నియమాలను...

ఈ ఆహారం బలవర్థకం!

కొవిడ్‌ బారిన పడినవాళ్లు త్వరగా కోలుకోవాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! ఇందుకోసం ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రిజుతా దివేకర్‌ కొన్ని ఆహార నియమాలను సూచిస్తున్నారు. అవేంటంటే....


  1. విటమిన్‌ సి, జింక్‌, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంచుకోవాలి. ఇందుకోసం మాంసాహారం, మష్రూమ్స్‌, బ్రొకొలి, అవకాడొలతో పాటు, అరటిపండ్లు, నారింజ, బత్తాయిలు కొవిడ్‌ డైట్‌లో చేర్చుకోవాలి. 
  2. ఉదయం అల్పాహారంలో నానబెట్టిన పప్పులు, నట్స్‌ తప్పనిసరిగా తినాలి. ఇందుకోసం వేరుసెనగ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ తినవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువ. కొవిడ్‌ నుంచి తేలికగా కోలుకోవడానికి తోడ్పడే పోషకాలు వీటిలో ఉంటాయి.
  3. రాగులు, ఓట్స్‌లో బి విటమిన్లు, ఐరన్‌, పీచుపదార్థం, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువ. తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయం అల్పాహారంలో వీటితో పాటు గుడ్డునూ చేర్చుకుంటే, కొవిడ్‌ నుంచి తేలికగా కోలుకోగలుగుతారు.
  4. జబ్బుపడిన వ్యక్తి త్వరగా కోలుకోవడానికి తోడ్పడే ఆహారం కిచిడి. పొట్టలో తేలికగా ఉండి, మెరుగైన పోషకాలను అందించే కిచిడి కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారికి ఐడియల్‌ మీల్‌. పప్పుధాన్యాలు, బియ్యం, కూరగాయల సమ్మేళనంతో తయారవుతుంది కాబట్టి కిచిడి తరచుగా తింటూ ఉండాలి.
  5. ఓఆర్‌ఎస్‌, హెర్చల్‌ డ్రింక్స్‌, కషాయాలు, కఢా, మజ్జిగ, పండ్ల రసాలు... ఇలా వీలైనన్ని ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలి.

Updated Date - 2021-05-04T05:30:00+05:30 IST