కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-17T04:36:23+05:30 IST

సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామని తహసీల్దారు పద్మావతి ఆదివారం తెలిపారు.

కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

వాకాడు, మే 16 : సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామని తహసీల్దారు పద్మావతి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దారు పద్మావతి మాట్లాడుతూ  కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సిన్‌పై సందేహాల నివత్తి, హోమ్‌ ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గూడూరు టిడ్కో కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లాలంటే వాహనం ఏర్పాటు, దురదృష్టవశాత్తు మరణాలు సంభవిస్తే ఖననం ఏర్పాట్ల కోసం 8498838328కు ఫోన్‌  చేసినట్లయితే సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. మండలంలో ఇప్పటి వరకు 112 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, 5 మరణాలు సంభవించాయన్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఎవరికి వారు రక్షించుకోవాల్సిన పరిస్థితి  నెలకొందన్నారు.

Updated Date - 2021-05-17T04:36:23+05:30 IST