ముగ్గురికి జన్మనిచ్చిన కరోనా బాధిత మహిళ

ABN , First Publish Date - 2021-06-17T14:25:48+05:30 IST

కరోనాతో బాధపడుతున్న ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మచ్చింది. తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో ఆమె జన్మనివ్వగా తల్లీపిల్లలు క్షేమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. తూత్తుకుడి సమీ

ముగ్గురికి జన్మనిచ్చిన కరోనా బాధిత మహిళ


ప్యారీస్‌(చెన్నై): కరోనాతో బాధపడుతున్న ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మచ్చింది. తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో ఆమె జన్మనివ్వగా తల్లీపిల్లలు క్షేమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. తూత్తుకుడి సమీపంలోని కోరంపల్లికి చెందిన విద్య గర్భవతి కాగా, తీవ్ర జ్వరంతో గత నెల 28వ తేదీన తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేల్చారు. ఆమెకు ఆక్సిజన్‌ తగ్గిపోవడంతో వైద్యులు తగి న చికిత్స అందించారు. దీనికి తోడు ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలడంతో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో 15 రోజుల క్రితం కాలేయ శస్త్రచికిత్స నిర్వహించారు. అదే సమయంలో ఆమెకు శస్త్రచికిత్స చేయగా, ముగ్గురు ఆడశిశువులకు జన్మనిచ్చింది. ఒక శిశువు బరువు 1.5 కిలోలు, మరో శిశువు 1.75 కిలోలు, 3వ శిశువు 1.3 కిలోల బరువు వున్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు గర్భంలో వున్నప్పుడే తల్లికి కరోనా రావడంతో కృత్రిమ ఆక్సిజన్‌ అందించారు. అంతేగాక రోగనిరోధక శక్తిని పెంచే మందులూ అందించారు. దీంతో వారంతా పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తల్లీపిల్లలు క్షేమంగా వుండడంతో మంగళవారం సాయంత్రం వారిని డిశ్చార్జి చేశారు.


Updated Date - 2021-06-17T14:25:48+05:30 IST