Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగం కోసం UAE వెళ్లిన భారతీయ మహిళ.. 7నెలలుగా ఆస్పత్రిలోనే.. చివరికి

రాస్ అల్ ఖైమా: ఉద్యోగం కోసం యూఏఈ వెళ్లిన భారతీయ మహిళ మహమ్మారి కరోనా బారిన పడింది. దాంతో ఏడు నెలలుగా రాస్ అల్ ఖైమాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిందామె. ఇటీవల ఆరోగ్యం కొంచెం కుదుటపడడంతో దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు ఆమెను గురువారం స్వదేశానికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనారోగ్యంతో భర్త మంచం పట్టాడు. ఉన్న ఒక్క కొడుకు కాలం చేశాడు. దాంతో వేరే దారిలేక కర్ణాటకు చెందిన ఎంఏ(54) అనే మహిళ ఉద్యోగం కోసం యూఏఈ చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న యూఏఈలో అడుగుపెట్టిన ఆమెకు 18న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాస్ అల్ ఖైమా ఫీల్డ్ ఆస్పత్రి‌లో చేరింది. 


ఇక ఆస్పత్రిలో చేరిన తర్వాత కరోనా కారణంగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో ఆమెను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె గుండెపోటుకు గురైంది. ఫిబ్రవరి 26న వెంటిలేటర్‌పై చేరిన ఆమె మార్చి 16 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత ఆమెను జనరల్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి వెంటిలేటర్‌పైకి చేర్చారు. 16 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స పొందిన అనంతరం ఆమె కొంచెం కోలుకుంది. అయితే, కరోనా నుంచి కోలుకున్న ఆమెకు వైరస్ సబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 

ఇలా ఏడు నెలలుగా రాస్ అల్ ఖైమా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆమెను చూసుకోవడానికి అక్కడ నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో అధికారులు స్వదేశానికి తరలించాలని నిర్ణయించారు. దీనికి సామాజిక కార్యకర్త నజీర్ వతనప్పల్లీ తనవంతు సహాకారం అందించారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులతో కలిసి ఆయన భారతీయురాలిని ఆమె స్వస్థలమైన మంగళూరుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఆమెతో పాటు ఓ నర్సును కూడా ఇండియాకు పంపించారు. దీనికి అయిన ఖర్చును భారత కాన్సులేటే భరించింది. అటు ఆస్పత్రిలో ఏడు నెలలకు గాను చికిత్సకు అయిన బిల్లును మానవత దృక్పథంతో యాజమాన్యం మాఫీ చేసింది. దాంతో ఎంఏ గురువారం స్వదేశానికి పయనమైంది. మంగళూరు చేరిన తర్వాత బంధువులు ఆమె‌ను రిసీవ్ చేసుకున్నట్లు నజీర్ వతనప్పల్లీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement