Abn logo
Sep 26 2021 @ 23:57PM

150 మందికి కరోనా

గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 150 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఆదివారం ఉదయం వరకు 5,063 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.96 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌తో ఆరోగ్యం విషమించి గుంటూరు రూరల్‌, బాపట్లలో ఒక్కొక్కరు మృతి చెందారు. 20 మంది హోం ఐసోలేషన్‌ నుంచి కోలుకోవడంతో క్రియాశీలక కేసులు 1,000కి చేరాయి. కొత్తగా గుంటూరు నగరంలో 66, తెనాలిలో 11, నిజాంపట్నంలో 8, నరసరావుపేటలో 8, మంగళగిరిలో 7, తుళ్లూరులో 5, మేడికొండూరులో 4, తాడేపల్లిలో 4, బాపట్లలో 3, చెరుకుపల్లిలో 3, ఫిరంగిపురంలో 2, ప్రత్తిపాడులో 2, ముప్పాళ్లలో 2, మాచర్లలో 2, చిలకలూరిపేటలో 2, రొంపిచర్లలో 2, నకరికల్లులో 2, కొల్లిపరలో 2, రేపల్లెలో 2, పొన్నూరులో 2, కర్లపాలెంలో 1, భట్టిప్రోలులో 1, వినుకొండలో 1, కారంపూడిలో 1, దాచేపల్లిలో 1, గురజాలలో 1, క్రోసూరులో 1, పెదనందిపాడులో 1, సత్తెనపల్లిలో 1, అచ్చంపేటలో 1, రాజుపాలెంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

ఆదివారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. 71,871 మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు, 40,905 మందికి  రెండో డోసు టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఒక డోసు వ్యాక్సిన్‌ చేయించుకున్న వారి సంఖ్య 25 లక్షల 45 వేల 439కి చేరింది. రెండో డోసుని 9 లక్షల 64 వేల 572 మంది చేయించుకున్నారు.