హాంకాంగ్ కీలక నిర్ణయం.. విమాన రాకపోకలపై నిషేధం!

ABN , First Publish Date - 2021-04-19T17:29:38+05:30 IST

హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఇండియా నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు

హాంకాంగ్ కీలక నిర్ణయం.. విమాన రాకపోకలపై నిషేధం!

న్యూఢిల్లీ: హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఇండియా నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఏప్రిల్ 20 నుంచే అమలులోకి వస్తాయని.. 14రోజులపాటు అంటే మే 3 వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారత్‌తోపాటు పాకిస్థాన్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చే విమానాలకు ఈ ఆదేశాలు వర్తియని హాంకాంగ్ వివరించింది. ‘భారత్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20 నుంచి 14 రోజులపాటు అమలవుతాయి. డిసీజ్ కంట్రోల్ విభాగం సచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాంకాంగ్ తెలిపింది. 


Updated Date - 2021-04-19T17:29:38+05:30 IST