Abn logo
Sep 26 2021 @ 00:02AM

110 మందికి కరోనా

2.51 శాతంగా పాజిటివ్‌ రేటు

గుంటూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 110 మందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం ఉదయం వరకు 4,377 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 2.51 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌తో ఆరోగ్యం విషమించి వినుకొండలో ఒకరు మృతి చెందారు. హోం ఐసోలేషన్‌ నుంచి 39 మంది కోలుకోగా క్రియాశీలక కేసులు 951కి చేరాయి. గుంటూరు నగరంలో కొత్తగా 29, నరసరావుపేటలో 9, చిలకలూరిపేటలో 7, తాడేపల్లిలో 5, మంగళగిరిలో 4, తాడికొండలో 3, రాజుపాలెంలో 3, మేడికొండూరులో 3, మాచవరంలో 3, నకరికల్లులో 3, బాపట్లలో 3, రేపల్లెలో 3, పొన్నూరులో 2, దుగ్గిరాలలో 2, సత్తెనపల్లిలో 2, యడ్లపాడులో 2,  బొల్లాపల్లి, రొంపిచర్ల, అమరావతి, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, దాచేపల్లి, దుర్గి, మాచర్ల, రెంటచింతల, చేబ్రోలు, కొల్లిపర, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, చుండూరు, వేమూరులో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 


కరోనా లక్షణాలతో కానిస్టేబుల్‌ మృతి

వట్టిచెరుకూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కారంకి వెంకటనాగశివకుమార్‌ (33) కొవిడ్‌ లక్షణాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ  శనివారం తెల్లవారుజామున కన్నుముశారు. ఆయనకు పలువురు పోలీసు అధికారులు నివాళులు అర్పించారు.