మావోయిస్టులపై కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2021-06-16T05:46:20+05:30 IST

మావోయిస్టులపై కొవిడ్‌ పంజా

మావోయిస్టులపై కొవిడ్‌ పంజా

దండకారణ్యంలో విజృంభిస్తున్న మహమ్మారి
వైరస్‌ బారిన వందలమంది దళసభ్యులు
పోలీస్‌ నిఘాతో ఆకుపసరలతో వైద్యం
ముగ్గురు కీలక నేతలు మృతి?
ఇల్లెందు, జూన్‌ 15:
వేలాది పోలీస్‌ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నా ఏమాత్రం జంకని అన్నలు, నిత్యం ఎన్‌కౌంటర్లతో అడవులు రక్తసిక్తమతున్నా ఎత్తిన తుపాకి దించకుండా తలపడుతున్న మవోయిస్టులు నేడు కంటికి కనిపించని శత్రువుగా హడలెత్తిస్తున్న కరోనా మహామ్మారితో పోరాడుతున్నారు. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలొదులుతున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో వేలాదిమందని బలిగొన్న కరోనా పచ్చని అడవుల్లో సేదతీర్చుతున్న మావోయిస్టు సాయుధ బలగాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు పోలీస్‌, ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. తెలంగాణ-ఛతీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్ధు అడవులతో కూడిన దండకారాణ్యంలో కరోనాకు సరైన వైద్యచికిత్సలు అందక అనేక మంది మృతి చెందినట్లు సమచారం. రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు ఏజెన్సీ గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై గట్టి నిఘా పెట్టారు. కరోనా బారిన పడిన వారు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యసేవలు అందిస్తామని, వారిపై ప్రకటించిన రివార్డుసైతం లొంగిపోయిన వారికే ఇస్తామని అటవీఫ్రాంత గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. నక్సల్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు వివరిస్తున్నారు. కరోనా ఉదృతికి సరైన వైద్యం అందక అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్లు, మరి కొంతమంది కరోనాను జయించినట్లు తెలుస్తోంది. సరైన వైద్యం అందక ఇప్పటికే ముగ్గురు కీలక నేతలు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. కరోనాకు బలైన కీలక నాయకులు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మూడు నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీలో వ్యూహా ప్రతి వ్యూహల్లో కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో క్రీయాశీల నేతగా వ్యవహారిస్తున్న గడ్డం దయాకర్‌ కరోనా బారిన పడి వైద్యకోసం వస్తున్న క్రమంలో ములుగు అడవుల్లో పోలీసులకు చిక్కనట్ల తెలుస్తోంది. అతడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే విధంగా దండకారణ్యంలో గెరిల్లా యుద్దంలో ఆరితేరినట్లు ప్రచారంలో ఉన్న మరో మావోయిస్టు నేత ఐతు సైతం కరోనా వైద్యకోసం దండకారణ్యం నుంచి వస్తూ చర్ల వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. అతడికి వైద్య పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఖమ్మంలో ఓ ప్రవేటు ఆసుపత్రిలో వైద్య సేవలందించారు.  అయినా కరోనా విషమించి మృత్యువాత పడ్డాడు. నాలుగు రోజు క్రితం తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మావోయిస్టు కీయాశీల నాయకుడు వ్యూహకర్తగా పెరొందిన కత్తి మోహాన్‌రావు అలియాస్‌ ప్రకాశన్న దండకారణ్యంలో కరోనాతో బాధడుతూ గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.  40 సంవత్సరాలుగా పార్టీలో ప్రాణాలను తెగించి పనిచేస్తూన్న ప్రకాశన్న మృతి పార్టీకి తీరనిలోటని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరంతా కరోనా తీవ్రతతోనే చనిపోవడం గమనార్హం. కరోనాతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టులు నాయకులు మెరుగైన వైద్య చికిత్స అందక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే తామే వైద్యం అందిస్తామని పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికి విశ్వసించని మవోయిస్టులు నాటు, ఆయుర్వేద వైద్యంపై ఆధారపడి చికిత్స పొందుతున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై పోలీసుల నిఘా ఉండటం, షెట్లర్‌జోన్‌గా ఉన్న దండకారణ్యంపై పోలీసు బలగాలు కాపు కాయడంతో కరోనా మావోయిస్టులకు పెను సవాల్‌గా మారిందనడంలో సందేహంలేదు.

Updated Date - 2021-06-16T05:46:20+05:30 IST