కోవిడ్ విజృంభణ... 24 గంటల్లో కొత్తగా 1,26,789 కేసులు...

ABN , First Publish Date - 2021-04-08T16:29:26+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రజలు చాలా అప్రమత్తంగాఉండవలసిన సమయం. కోవిడ్

కోవిడ్ విజృంభణ... 24 గంటల్లో కొత్తగా 1,26,789  కేసులు...

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం. కోవిడ్-19 రోజు రోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలను ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,789. అంటే 24 గంటల్లో ఒక లక్ష కేసులు దాటడం ఇది మూడోసారి. మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత దేశం ఉంది.


ఏప్రిల్ 5న నమోదైన కొత్త కేసులు 1,03,558 కాగా, ఏప్రిల్ 7న 1,15,736 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గురువారం ఉదయానికి గడచిన 24 గంటల్లో కొత్తగా  1,26,789 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319. ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారు గడచిన 24 గంటల్లో 59,258 మంది కాగా, మొత్తం మీద 1,18,51,393 మంది కోలుకున్నారు. ఈ వ్యాధి నుంచి  రికవరీ రేటు 92.11 శాతం. ఈ వ్యాధి వల్ల మొత్తం మీద 1,66,862 మంది ప్రాణాలు కోల్పోయారు. 


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 7న 12,37,781 శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. మొత్తం మీద ఐసీఎంఆర్ టెస్ట్ చేసిన నమూనాల సంఖ్య 25,26,77,379.


Updated Date - 2021-04-08T16:29:26+05:30 IST