భయం వద్దు.. ధైర్యంగా ఉండండి

ABN , First Publish Date - 2021-05-05T06:39:03+05:30 IST

‘ప్రభుత్వ వైద్యశాలలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సకల సౌకర్యాలు సమకూరుస్తున్నాం. మందులకు కొరత లేకుండా చూస్తున్నాం.

భయం వద్దు.. ధైర్యంగా ఉండండి

కేర్‌ సెంటర్లను పకడ్బందీగా నిర్వహిస్తాం 

ప్రైవేటు వైద్యశాలలను కట్టడి చేస్తాం 

నిధుల సమస్య లేనే లేదు  

‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి బాలినేని 

 (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘ప్రభుత్వ వైద్యశాలలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సకల సౌకర్యాలు సమకూరుస్తున్నాం.  మందులకు కొరత లేకుండా చూస్తున్నాం. నాతోపాటు పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. భయం వద్దు ధైర్యంగా ఉండండి’ అని జిల్లాలోని కొవిడ్‌ బాధిత ప్రజానీకానికి విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జిల్లాలోని రిమ్స్‌తో పాటు ఇతర అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లతోపాటు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఇంజక్షన్ల వినియోగానికి రిమ్స్‌లో అనవసరమైన ఆంక్షలు విధించినా, ప్రైవేటు వైద్యశాలలకు విక్రయించకపోయినా తగుచర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు వైద్యశాలల్లో బాధితులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాల్సిన వారి నుంచి కూడా భారీగా వసూలు చేస్తున్న విషయాలు కూడా తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఎవరు తప్పుచేసినా ఉపేక్షించేది లేదన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వైద్యసిబ్బందిని నియమించటమే గాక వాటి నిర్వహణకు పూర్తిస్థాయి నిధులను కేటాయించి నట్లు తెలిపారు. జిల్లాకు తక్కువ నిధుల కేటాయింపు జరిగిందన్న ప్రచారాన్ని ఆయన  ఖండించారు. అలాగే వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులందరినీ బాధితులకు అండగా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపుని స్తున్నట్లు తెలిపారు.  తన వద్ద పనిచేసే సిబ్బంది ఇద్దరికి పాజిటివ్‌ నిర్థారణ అయిందని, వారిని వైద్యశాలలో చేర్పించి ఆ తర్వాత ఒంగోలు వచ్చి ఇక్కడే కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని చెప్పారు. 


Updated Date - 2021-05-05T06:39:03+05:30 IST