కరోనాతో ఆసుపత్రిలో చేరితే రూ.26 లక్షల బిల్లు వేశారు..

ABN , First Publish Date - 2021-06-25T18:46:08+05:30 IST

కొవిడ్‌ చికిత్సలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో పాటించడం లేదని పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా బెంగళూరు

కరోనాతో ఆసుపత్రిలో చేరితే రూ.26 లక్షల బిల్లు వేశారు..


బెంగళూరు: కొవిడ్‌ చికిత్సలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో పాటించడం లేదని పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో పేరొందిన ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఏకంగా ఓ బాధితుడికి 26 లక్షల రూపాయలు బిల్లు వేసింది. ఇప్పటికే 21 లక్షల రూపాయలు బాధితుడి కుటుంబీకులు చెల్లించారు. బుధవారం రాత్రి కొవిడ్‌ బాధితులు మృతి చెందారు. మిగిలిన 5 లక్షల రూపాయలు జమ చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్ళాలని ఆస్పత్రి పాలక మండలి సూచించింది. బంధువులు ఆస్పత్రి వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. 


Updated Date - 2021-06-25T18:46:08+05:30 IST