952 మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-21T18:22:15+05:30 IST

బళ్లారి, విజయనగర జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 952 కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. బళ్లారి జిల్లాలో 582, విజయనగర జిల్లాలో 370 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4827 యాక్లివ్‌ కేసులు ఉన్నట్లు

952 మందికి Covid పాజిటివ్

బళ్లారి(కర్ణాటక): బళ్లారి, విజయనగర జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 952 కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. బళ్లారి జిల్లాలో 582, విజయనగర జిల్లాలో 370 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4827 యాక్లివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బళ్లారి తాలూకాలో గురువారం సాయంత్రానికి 351, కురుగోడులో 53, కంప్లి 1, సండూరు 123, సిరుగుప్ప 54 కేసులు నమోదు అయ్యాయి. విజయనగర జిల్లా కేంద్రమైన హొసపేటలో 202 , కూడ్లిగి 42, కొట్టూరు 15, హగరిబొఇమ్మనహళ్ళి 25, హరపనహళ్ళి 43, హడగలిలో 43 కేసులు నమోదు అయ్యాయి. గురువారం రెండు జిల్లాల్లో 171 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ అయ్యారు. కాగా ఇంతవరకూ బళ్లారి జిల్లాలో 3,282 మంది, విజయనగర జిల్లాలో 1539 మంది కొవిడ్‌తో మరణించాడు. 


బళ్లారి కల్చరల్‌: కొవిడ్‌ మహమ్మారి మూడో దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీఎంసీ మార్కెట్లో పలు ఆంక్షలు విధించారు. చిల్లర కూరగాయల విక్రయాలను నిషేధించి.. ఓల్‌సేల్‌ విక్రయాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కూరగాయల కోసం ఒకే చోటికి అందరూ వస్తే కొవిడ్‌ మరింత వ్యాప్తి చెందుతుందని భావించిన జిల్లా పాలక మండలి నగరంలోని పలు ప్రదేశాల్లో కూరగాయలు విక్రయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. బళ్లారి నగరంలోని ఈద్గామైదానం, కిత్తూరురాణి చెన్నమ్మ, ప్రభుత్వ మున్సిపల్‌ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ కళాశాల, సెయింట్‌ జాన్స్‌, విమ్స్‌ క్రీడామైదానాల్లో కూరగాయల విక్రయాలకు అనుమతిచ్చారు. ఏపీఎంసీ మార్కెట్‌కు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

 కంప్లి: కురుగోడు పట్టణంలోని కాయగూరల వ్యాపారులకు కొవిడ్‌ నియమాలపై ఎమ్మెల్యే జేఎన్‌ గణేష్‌ గురువారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ క్రీడాంగణంలో కాయగూరల వ్యాపారుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే వ్యాపారులను అప్రమత్తం చేశారు. తహసీల్దార్‌ రాఘవేంద్రరావు మాట్లాడుతూ... రద్దీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడాంగణంలో కూరగాయల మార్పెట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వారివెంట పురసభ కార్యదర్శి పరశురామ్‌, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. 

  

46 మంది విద్యార్థులకు కొవిడ్‌

 కురుగోడు తాలూకా పరిధి యర్రంగళి గ్రామ సమీపంలోని మొరార్జీ దేశాయ్‌ వసతి పాఠశాలలో 46 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 46 మందికి పాజిటివ్‌గా గురువారం నిర్దారణ అయింది. దీంతో తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, గ్రేడ్‌-2 తహసీల్దార్‌ మల్లేశప్ప, ఈఓ నిర్మల, డిప్యూటీ తహసీల్దార్‌ యాకుబ్‌ అలీ, డాక్టర్‌ రవిచంద్ర, రేష్మ, ఆర్‌ఐ కరిబసప్ప, పీడీఓ రామారావు, ఆర్‌ఐ కరిబసప్ప, ప్రిన్సిపాల్‌ యర్రిస్వామి వెంటనే మొరార్జీదేశాయ్‌ పాఠశాలకు చేరుకున్నారు. 46 మంది విద్యార్థులకు ప్రత్యేకించి హోమ్‌ క్వారంటైన్‌ గదులు ఏర్పాటు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. వారికి డాక్టర్‌ రవిచంద్ర, రేష్మ వైద్య సేవలు అందించారు. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు రవిచంద్ర అవగాహన కల్పించారు. 

Updated Date - 2022-01-21T18:22:15+05:30 IST