మెడికల్‌ కళాశాలలో మరో 116మందికి Covid

ABN , First Publish Date - 2021-11-27T18:26:22+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో రాష్ట్రమంతటా ఆలోచన కలి గించే పరిస్థితి నెలకొంది. ధారవాడ శ్రీధర్మస్థళ మంజునాథస్వామి మెడికల్‌ కళాశాలలో రెండోరోజు కేసుల పరం

మెడికల్‌ కళాశాలలో మరో 116మందికి Covid

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో రాష్ట్రమంతటా ఆలోచన కలిగించే పరిస్థితి నెలకొంది. ధారవాడ శ్రీధర్మస్థళ మంజునాథస్వామి మెడికల్‌ కళాశాలలో రెండోరోజు కేసుల పరంపర కొనసాగింది. గురువారం 66మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా రెండో రోజు శుక్రవారం మరో 116ల మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మెడికల్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు, సిబ్బందితో కలిపి 182 మంది బాధితులయ్యారు. ఈనెల 17న ఫ్రెషర్స్‌ డే పార్టీ వేళ విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ తర్వాత నలుగురైదుగురికి జ్వరం, దగ్గు లక్షణాలు రావడంతో పరీక్షలు జరిపించగా కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. మెడికల్‌ కళాశాలలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులతో కలిపితే 3000ల మంది దాకా ఉన్నారు. వారందరికీ పరీక్షలు జరిపించదలచారు. కాగా బెంగళూరు నగరం సర్జాపుర రోడ్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 33మంది విద్యార్థులకు గురువారం పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఇక్కడి విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు జరిపించదలచారు.

Updated Date - 2021-11-27T18:26:22+05:30 IST