కొవిడ్ కేర్ కేంద్రంలో బాలికపై లైంగిక దాడి...నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-24T16:55:28+05:30 IST

ఢిల్లీలోని కొవిడ్ కేర్ కేంద్రంలో కరోనా సోకిన మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన బాలుడిని, దానికి సహకరించిన మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు....

కొవిడ్ కేర్ కేంద్రంలో బాలికపై లైంగిక దాడి...నిందితుల అరెస్ట్

న్యూఢిల్లీ :  ఢిల్లీలోని కొవిడ్ కేర్ కేంద్రంలో కరోనా సోకిన మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన బాలుడిని, దానికి సహకరించిన మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. 13 ఏళ్ల బాలికకు కరోనా సోకడంతో కొవిడ్ కేర్ సెంటరులో చేరింది. బాలికకు తెలిసిన ఇద్దరు బాలురకు కూడా కరోనా సోకడంతో వారు కూడా అదే కేంద్రంలో చేరారు. బాలికను బాత్ రూంలోకి లాక్కెళ్లి ఓ బాలుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు దీనికి సహకరించడంతోపాటు బాలిక లైంగిక దాడి ఘటనను సెల్ ఫోనులో చిత్రీకరించాడు. ఈ ఘటనలో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-07-24T16:55:28+05:30 IST