పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2021-08-03T18:22:09+05:30 IST

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. పొరుగున కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం మరిన్ని నియంత్రణ

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

హోసూరు: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. పొరుగున కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం మరిన్ని నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచనతో సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అత్తిబెలె వద్ద మాత్రమే తనిఖీలు సాగుతుండగా జూజువాడి చెక్‌పోస్టులో ఎటువంటి చర్యలు లేవు. దీంతో ఈ మార్గంలో కార్లు, టెంపోలు ఇతర వాహనాల ద్వారా తమిళనాడు, కేరళ రాష్ట్రానికి రాకపోకలు పెరిగాయి. గుంపులుగా సంచరించేవారిసంఖ్య అధికం కావడంతో మూడో విడత ఎక్కడ ప్రబలుతుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్టులలో థర్మల్‌స్ర్కీనింగ్‌, కొవిడ్‌ టెస్టులు జరిపి నెగిటివ్‌ రిపోర్టులు ఉంటేనే అనుమతించాలని లేనిపక్షంలో వైరస్‌ ప్రబలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-03T18:22:09+05:30 IST