67.19కి చేరిన కోవిడ్ రికవరీ శాతం

ABN , First Publish Date - 2020-08-05T23:04:19+05:30 IST

దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం మరింత పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారంనాడు..

67.19కి చేరిన కోవిడ్ రికవరీ శాతం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం మరింత పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. రికవరీ రేటు 67.19కి పెరిగిందని, మృతుల శాతం 2.09కి తగ్గిందని వివరించింది.


దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19,08,255గా ఉందని, వీటిలో 5,86,244 యాక్టివ్ కేసులు ఉండగా, 12,82,216 మంది పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయినట్టు పేర్కొంది. మృతుల సంఖ్య 39,795కి చేరినట్టు ఆ ప్రకటన పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదు కాగా, 50,000 పైబడి కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఏడో రోజు.

Updated Date - 2020-08-05T23:04:19+05:30 IST