Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌ రిలీఫ్‌ కిట్ల అందజేత

పొదలకూరు, డిసెంబరు 2 : కరోనా మొదటి వేవ్‌, రెండో వేవ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు గురువారం కొవిడ్‌ రిలీఫ్‌ కిట్లను   వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వంటనూనె, కందిపప్పు, గోధుమపిండి, వేరుశెనగ పప్పు, ఇడ్లీరవ్వ, శనగలు, బెల్లం, సబ్బులు పంపిణీ చేశారు. మండలంలోని మొగళ్లూరు గ్రామానికి చెందిన ఆకుల గీతిక, బొగ్గు సుకుమార్‌, గురవాయపాళెం, వెంకటాపురం గ్రామాలకు చెందిన లక్ష్మీప్రసన్న, వై.బేబి, రమణారెడ్డి, కాలనీలకు చెందిన అమర్తలూరు రిషిక, తాప్సికలకు సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ చేతుల మీదుగా అందజేశారు.  కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో వి.విజయలక్ష్మి, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement