కొవిడ్‌ అపోహలు - వాస్తవాలు!

ABN , First Publish Date - 2021-04-06T05:41:14+05:30 IST

కొవిడ్‌ - 19 వేడి, తేమ, చల్లని... వాతావరణంతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా విస్తరిస్తుంది. దోమల ద్వారా కొవిడ్‌ ఒకరి నుంచి మరొకరికి సోకదు...

కొవిడ్‌ అపోహలు - వాస్తవాలు!

నిజం: కొవిడ్‌ - 19 వేడి, తేమ, చల్లని... వాతావరణంతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా విస్తరిస్తుంది.

నిజం: వేడి నీటి స్నానం కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించలేదు.

నిజం: దోమల ద్వారా కొవిడ్‌ ఒకరి నుంచి మరొకరికి సోకదు.

నిజం: చైనా లేదా కొవిడ్‌ విస్తరించిన దేశాలలో తయారైన వస్తువులను తాకడం ద్వారా కొవిడ్‌ సోకదు.

నిజం:  శరీరం మొత్తం ఆల్కహాల్‌ లేదా క్లోరిన్‌ స్ర్పే చేసుకోవడం వల్ల అప్పటికే శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ చనిపోదు.

నిజం: న్యుమోనియా వ్యాక్సిన్‌ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించలేదు. అయితే శ్వాసకోశ వ్యాధుల కోసం వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదే!

నిజం:  వెల్లుల్లి తినడం ద్వారా కొవిడ్‌ నుంచి రక్షణ పొందవచ్చని ఎక్కడా రుజువు కాలేదు.

నిజం: వ్యాక్సిన్‌ మొదటి డోసు, బూస్టర్‌ డోస్‌ రెండూ తీసుకున్నవాళ్లు కూడా మాస్క్‌ ధరించవలసిందే!

నిజం: లక్షణాలు లేకపోయినా, కొవిడ్‌ వైరస్‌ సోకి ఉండే అవకాశం ఉంటుంది. 

నిజం:  హ్యాండ్‌ డ్రయర్స్‌ కొవిడ్‌ వైర్‌సను చంపలేవు.

నిజం: కొవిడ్‌ నియంత్రణకు ఎటువంటి యాంటీబయాటిక్స్‌ లేవు. 

నిజం: చేతులను స్టెరిలైజ్‌ చేయడానికి శానిటైజర్‌ వాడుకోవాలి. యువి ల్యాంప్స్‌ వాడడం సరి కాదు. 

నిజం:  గాలి చొరబడే మూడు పొరల కాటన్‌ మాస్క్‌ వేసవిలో ఉత్తమం.

నిజం:  కరోనా ఇన్‌ఫెక్షన్‌కు వయసుతో నిమిత్తం లేదు. మరీ ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్నవారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు ఎక్కువ.


Updated Date - 2021-04-06T05:41:14+05:30 IST