కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-18T03:49:46+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి

కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి
వ్యాపారులతో మాట్లాడుతున్న సీఐ వేమారెడ్డి

ముత్తుకూరు, జనవరి17: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి తెలిపారు. ముత్తుకూరు ప్రధాన కూడలిలో సోమవారం ఆయన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల ముందు వినియోగదారులు ఎక్కువగా గుమికూడుతున్నందున, కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. అందువల్ల ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్‌ ధరించిన వారినే దుకాణం వద్దకు అనుమతించాలన్నారు. అవసరమైన శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.  ఇటీవల మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. మాస్క్‌ లేకుండా వాహనాలపై తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి, కొవిడ్‌ నిబంధలను, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ శివకృష్ణారెడ్డి, పోలీసులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. 

తోటపల్లిగూడూరు : ఒమిక్రాన్‌, కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకైక ఆయుధం ‘‘ఎస్‌ఎంఎస్‌ (సోషల్‌ డిస్టెన్స్‌, మాస్క్‌, శానిటైజర్‌)ఒక్కటేనని కృష్ణపట్నం సీఐ కె.వేమారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కె.ఇంద్రసేనారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ  మాట్లాడుతూ పోలీసులు కూడా మాస్క్‌లు ధరించాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. సమావేశంలో  పోలీసులు, తదితరులు పాల్గొన్నారు. కి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-01-18T03:49:46+05:30 IST