Abn logo
May 5 2021 @ 10:44AM

కరోనా నిబంధనలు కఠినతరం

                     - 6 నుంచి దుకాణాల మూసివేత


ఐసిఎఫ్‌(చెన్నై): కిరాణ, కూరగాయల దుకాణాలు మినహా ఇతర దుకా ణాలన్నింటికీ ఈ నెల 6వ తేదీ నుంచి మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అడ్డుకొనేలా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ నేప థ్యంలో, వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం...


- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి.

- సబర్బన్‌, మెట్రోరైళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీ, ఆటోల్లో 50 శాతం మాత్రమే ప్రయాణించాలి.

- వాణిజ్య కాంప్లెక్స్‌ల్లో షాపులు, కూరగాయల దుకాణాలకు అనుమతి లేదు. ఇవి మినహా మిగిలిన కిరాణ, కూరగాయల దుకాణాలు మాత్రమే ఏసీ లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచుకోవచ్చు.

- కిరాణ, కూరగాయల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు తెరి చేందుకు నిషేధం.

- మెడికల్‌ షాపులు, పాల విక్రయ దుకాణాలు యధావిధిగా పని చేస్తాయి.

- అన్ని హోటళ్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి. టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయాలి.

- ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకు నిషేధం.

- అంత్యక్రియల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి.


Advertisement
Advertisement
Advertisement