థర్డ్‌వేవ్‌ను అడ్డుకునేందుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-12-29T17:39:40+05:30 IST

రాష్ట్రంలో కొ విడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ ప్రకటించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన

థర్డ్‌వేవ్‌ను అడ్డుకునేందుకు సన్నద్ధం

- పిల్లలకు పాఠశాలల్లో, సీనియర్‌ సిటిజన్లకు ఇళ్లలోనే టీకా 

- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌


బెంగళూరు: రాష్ట్రంలో కొ విడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ ప్రకటించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడా రు. నైట్‌ కర్ఫ్యూ ఉద్దేశ్యం కూడా ఇదేనని, ఇందుకు ప్రజలు పరిపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ల ప్రక్రియను యుద్ధప్రాతిపదకపై పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన సూచనలు చేశామన్నారు. ప్రభుత్వం సకాలంలో తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగానే ఒమైక్రాన్‌ వైరస్‌ పూర్తి నియంత్రణలో ఉందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. రాష్ట్రంలో పిల్లలకు పాఠశాలల్లోనూ, 60 ఏళ్లు పైబడినవారికి ఇళ్లలోనే టీకాలు వేస్తున్నామన్నారు. కాగా జనవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏళ్లవారికి వ్యాక్సిన్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. కేంద్రం ఆరోగ్యశాఖ నుంచి సూచనలు అందిన తక్షణం బూస్టర్‌ డోసు ప్రక్రియను చేపడతామన్నారు. తొలి ప్రాధాన్యతను కరోనా వారియర్స్‌కు కల్పిస్తామన్నారు. కర్ణాటక వాణిజ్య పరిశ్రమల సమాఖ్య పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు బూస్టర్‌డోసు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిందని, దీనిపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. కాగా బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నైట్‌ కర్ఫ్యూ అమలుకు సంబంధించి నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలు ఎక్కడా రిస్కు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిత్యం 300మంది శ్యాంపిల్స్‌ను జినోమ్‌ సీక్వెన్సింగ్‌ వైద్య పరీక్షల కు పంపుతున్నామన్నారు. జనవరి 7 తర్వాత కూడా నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందా.. అనే అంశంపై స్పష్టత ఇవ్వలే దు. ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. 


బెడ్‌ బ్లాకింగ్‌కు నో చాన్స్‌ 

కరోనా రెండో వైరస్‌ వేళ పలు ఆసుపత్రులలో పడకల రిజర్వేషన్‌కు సంబంధించి కొన్ని తప్పుడు నిర్ణయాలు జరిగిన మాట నిజమేనని అయితే పునరావృతం కాకుండా బీబీఎంపీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కమిషనర్‌ గౌరవ్‌గుప్త ప్రకటించారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ఒకవేళ సమస్య తలెత్తితే నేరుగా బీబీఎంపీ రంగంలోకి దిగుతుందన్నారు. ఇప్పటికే 300 మంది వైద్యులతో ఒక బృందాన్ని సిద్ధం చేశామన్నారు. పూర్తి సాంకేతిక విధానాలతో అక్రమాలకు తావులేని విధంగా అవసరమైనవారికి పడకలు దక్కేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. 

Updated Date - 2021-12-29T17:39:40+05:30 IST