మూడో విడత నియంత్రణకు ఆంక్షలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-08-03T17:09:21+05:30 IST

రాష్ట్రంలో మూడోవిడత కొవిడ్‌ నియంత్రించేందుకు ఆంక్షలు తప్ప నిసరి అని 2శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాలపై నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్ర భుత్వానికి సూచించింది.

మూడో విడత నియంత్రణకు ఆంక్షలు తప్పనిసరి

- 2 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ జిల్లాలపై నిఘా 

- ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్‌ సూచన 


బెంగళూరు: రాష్ట్రంలో మూడోవిడత కొవిడ్‌ నియంత్రించేందుకు ఆంక్షలు తప్పనిసరి అని 2శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాలపై నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశమై నివేదిక రూపంలో సర్కార్‌కు సూచించింది. కేరళ, మహారాష్ట్రలనుంచి కర్ణాటకకు వచ్చేవారు 2డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నా ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేయాలని సూచించింది. 2శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కల్గిన జిల్లాలపై నిఘా పెట్టాలని ఆదేశించింది. వాణిజ్య వ్యవహారాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6వరకు మాత్రమే వెసలు బాటు కల్పించాలని, నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సూచించింది. రాత్రి 7గంటలనుంచి ఉదయం 6దాకా నిబంధనలు వర్తింపచేయాలని సలహా ఇచ్చింది. వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా అమలులో ఉండాలని, అన్ని కార్యాలయాలలోనూ 50శాతం సిబ్బందికి మాత్రమే పని కల్పించాలని, వర్క్‌ ఫ్రం హోంకు ప్రోత్సహించాలని సూచించింది. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. మాస్క్‌, భౌతికదూరం, చేతులు శుభ్రం చేసుకోవడం విధిగా పాటించాలన్నారు. ప్రస్తుతానికి పాజిటివిటీ రేటులో దక్షిణకన్నడ 5.64, చిక్కమగళూరు 4.82, కొడగు 4.69, ఉడుపి 4.27, హాసన్‌ 2.66, శివ మొగ్గ 3.2, చామరాజనగర్‌ 2.15, మైసూరు 2.04గా కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-08-03T17:09:21+05:30 IST