Covid వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? లేదా?

ABN , First Publish Date - 2021-12-03T16:35:03+05:30 IST

కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. దీంతో రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? లేదా? అనే అంశాన్ని

Covid వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? లేదా?

                        - నిఘా కోసం పర్యవేక్షక సభ్యులు


అడయార్‌(చెన్నై): కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. దీంతో రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం కొంతరు పర్యవేక్షక సభ్యులను ఆరోగ్య శాఖ నియమించింది. అలాగే, బహింగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారిని గుర్తించి అపరాధం విధించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వవినాయకం అధికారులను ఆదేశించారు. ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టే చర్యల్లో భాగంగా, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులను నియమించారు. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చే వారికి పాజిటివ్‌గా తేలినపక్షంలో వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సెస్‌కు పంపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. 

Updated Date - 2021-12-03T16:35:03+05:30 IST