టీకాల్లో బెంగళూరు నగర జిల్లా టాప్‌

ABN , First Publish Date - 2021-12-24T19:07:57+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల ప్రజలలో చైతన్యం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం తొలిడోసు వ్యాకిన్‌ పొందగా, రెండో డోసు 75 శాతం వేయించుకున్నారు. బెంగళూరు మహానగర పాలికెను మినహాయించి నగర జిల్లా

టీకాల్లో బెంగళూరు నగర జిల్లా టాప్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల ప్రజలలో చైతన్యం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం తొలిడోసు వ్యాకిన్‌ పొందగా, రెండో డోసు 75 శాతం వేయించుకున్నారు. బెంగళూరు మహానగర పాలికెను మినహాయించి నగర జిల్లా పరిధిలో వందశాతం రెండు డోసులు పూర్తయిన తొలి జిల్లాగా నిలిచినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. బెంగళూరు నగర జిల్లాలో వందశాతం కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆరోగ్య కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో నాలుగింట మూడుశాతం మంది యువత సంపూర్ణంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు తెలిపారు. బెంగళూరు నగర, కొడగు, మండ్య, రామనగర్‌, ఉడుపి, బాగల్కోటె, ఉత్తరకన్నడ, హాసన్‌, మైసూరు, కోలారు, బెంగళూరు గ్రామీణ, విజయపుర, బెళగావి, దక్షిణకన్నడ, చిక్కబళ్ళాపుర, దావణగెరె జిల్లాల్లో 75 శాతం వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు. కొడగులో 90శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ పొందారన్నారు. బెంగళూరు పాలికె, ధార్వాడ, చిత్రదుర్గ, బీదర్‌, గదగ్‌, చామరాజనగర్‌, తుమకూరు, చిక్కమగళూరు, శివమొగ్గ, యాదగిరి, కొప్పళ, బళ్ళారి జిల్లాల్లో 60-74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ పొందారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరాసరి 97 లక్షల మంది తొలిడోసు పొందారన్నారు. రాష్ట్రంలో 4,89,16,000 మంది వ్యాక్సిన్‌కు అర్హులు కాగా 4,72,87,087మంది తొలి డోసును పొందారన్నారు. రెండో డోసును ఇప్పటి వరకు 3,66, 16,251మంది పొందారని ఇది 75 శాతం దాకా ఉందన్నారు. 

Updated Date - 2021-12-24T19:07:57+05:30 IST