వనదేవతలను దర్శనం చేసుకోవాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే

ABN , First Publish Date - 2021-12-13T00:53:16+05:30 IST

మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులు ఎవరైనా ఇక తప్పని సరి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అమ్మవార్లను దర్శించుకోవాల్సి వుంటుంది.

వనదేవతలను దర్శనం చేసుకోవాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులు ఎవరైనా ఇక తప్పని సరి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అమ్మవార్లను దర్శించుకోవాల్సి వుంటుంది. వనదేవతల దర్శనం కోసం రోజూ పెద్ద సంఖ్యల భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, చత్తీస్ గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే టీకా తీసుకోనికి వారి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-12-13T00:53:16+05:30 IST