కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-29T16:37:58+05:30 IST

కరోనా టీకాకు భయపడిన వ్యక్తి చెట్టెక్కిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పుదుచ్చేరి సమీపం కోనిరికుప్పం గ్రామంలో వైద్య సిబ్బంది సోమవారం కరోనా టీకాలు వేసే పనులు చేపట్టారు. ఓ

కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన వ్యక్తి

పెరంబూర్‌(చెన్నై): కరోనా టీకాకు భయపడిన వ్యక్తి చెట్టెక్కిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పుదుచ్చేరి సమీపం కోనిరికుప్పం గ్రామంలో వైద్య సిబ్బంది సోమవారం కరోనా టీకాలు వేసే పనులు చేపట్టారు. ఓ ఇంట్లోని వ్యక్తికి టీకా వేసే సమయంలో అతను హఠాత్తుగా, తనకు చెట్లు నరికే పని వుందంటూ ఇంటి పక్కనే చెట్టు పైకెక్కాడు. కరోనా టీకా వేసుకోవాలని వైద్య సిబ్బంది ఎంత బతిమాలినా అంగీకరించని సదరు వ్యక్తి, అవసరమైతే మీరే చెట్టెక్కి నాకు టీకా వేయండి అంటూ బదులిచ్చాడు. దీంతో, చేసేదేమీ లేక వైద్య సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - 2021-12-29T16:37:58+05:30 IST