veluru: వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బహుమతుల ప్రదానం

ABN , First Publish Date - 2021-10-14T13:45:41+05:30 IST

స్థానిక కార్పొరేషన్‌ పరిధిలోని 2వ మండలంలో గత ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సి నేషన్‌ డ్రైవ్‌లో టీకాలు వేసుకున్న వారి పేర్లు లాటరీ తీసి ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. సత్తువా

veluru: వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బహుమతుల ప్రదానం

వేలూరు(చెన్నై): స్థానిక కార్పొరేషన్‌ పరిధిలోని 2వ మండలంలో గత ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సి నేషన్‌ డ్రైవ్‌లో టీకాలు వేసుకున్న వారి పేర్లు లాటరీ తీసి ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. సత్తువాచేరి వార్డు 18వ వార్డుకు చెందిన అరవింద్‌కు మొదటి బహుమతిగా వాషింగ్‌ మెషీన్‌, 17వ వార్డుకు చెందిన శ్రీనివాసన్‌, జ్యోతి, శ్రీనివాసన్‌లకు రెండవ బహుమతిగా బంగారు కమ్మలు, మూడో బహుమతిగా 23వ వార్డుకు చెందిన కోటికి మిక్సీ, నాలుగో బహుమతిగా 100 మందికి సిల్వర్‌ పాత్రలను కార్పొరేషన్‌ కమిషనర్‌ శంకరన్‌ అందజేశారు. కార్యక్రమంలో మా నగర సంక్షేమ అధికారి డాక్టర్‌ మణివన్నన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ మదివానన్‌, ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్‌ పాల్గొన్నారు. కాగా, బహుమతులు అందజేసిన సమాజసేవకుడు దినేష్‌ శరవణన్‌ను అధికారులు, ప్రజలు అభినందించారు.

Updated Date - 2021-10-14T13:45:41+05:30 IST