5,851 మందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-20T05:09:48+05:30 IST

5,851 మందికి వ్యాక్సినేషన్‌

5,851 మందికి వ్యాక్సినేషన్‌

  మూడో రోజుకు చేరిన టీకాలు


  ములుగులో ఒకరికి స్వల్ప అస్వస్థత


హన్మకొండ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. ఒకరికి స్వల్ప అస్వస్థత కలగడం మినహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5821 మంది టీకాలు తీసుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 27 సెంటర్లలో 1350 మందికి టీకాలు వేయగా, కొత్తగా 13 వ్యాక్సినేషన్‌ సెంటర్లను తెరిచారు. ఐనవోలు, కడిపికొండ, సిద్దాపూర్‌, ఎల్కతుర్తి, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, ఖిలా వరంగల్‌, చింతల్‌, పెద్దమ్మగడ్డ, కాశిబుగ్గ, సోమిడి, కేఎంసీ, ప్రాంతీయ నేత్ర వైద్యశాల, డీఎంహెచ్‌వో కార్యాలయం, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వ్యాక్సినేషన్‌ సెంటర్లను తెరిచారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 13 సెంటర్లలో 514 మందికి టీకా వేయగా, ములుగు జిల్లాలో 16 సెంటర్లలో 1275 మందికిగాను 887 మందికి టీకాలు వేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని పీహెచ్‌సీలో ఆర్‌బీఎ్‌సకే డాక్టర్‌ శ్రీలత వ్యాక్సిన్‌ వేసుకున్న కొద్ది సేపటికి స్వల్ప అస్వస్థతకు గురికాగా కొద్ది సేపటి తర్వాత కోలుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 20 సెంటర్లలో 671 మందికి  టీకా వేయగా, మహబూబాబాద్‌ జిల్లాలో మొత్తం 19 సెంటర్లలో 1648 మందికి,  జనగామ జిల్లాలో 17 సెంటర్లలో 751 మందికి వ్యాక్సిన్లు వేశారు.


Updated Date - 2021-01-20T05:09:48+05:30 IST