Abn logo
May 7 2021 @ 20:12PM

పేటీఎంలో... కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత సమాచారం...

నోయిడా : కరోనా విలయతాండవం నేపధ్యంలో... కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత సమాచారం ఇకపై పేటీఎం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సిన్ ఎక్కడ లభ్యత సమాచారంతో పాటు టైమ్‌స్లాట్ వివరాలను కూడా సంబంధిత యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేటీఎం వెల్లడించింది. ఇందుకోసం ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


అంతేకాకుండా... ఆయా స్లాట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేయనుంది కూడా. మొత్తం 780 జిల్లాల్లో వ్యాక్సిన్ లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని పేటీఎం అందించనున్నట్టు వెల్లడించింది. ఏజ్ గ్రూప్, పిన్ కోడ్‌ల ద్వారా కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చని పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ తన ట్వీట్‌లో వెల్లడించారు. 

Advertisement