పొలాల్లోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-17T18:27:05+05:30 IST

బళ్లారి జిల్లా సండూరు తాలూకాలో వ్యవసాయ కార్మికులకు పొలంలోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం చేపట్టింది. తాలూకాలోని ప్రజలు టీకాలు వేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్న

పొలాల్లోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

 

బళ్లారి(కర్ణాటక): బళ్లారి జిల్లా సండూరు తాలూకాలో వ్యవసాయ కార్మికులకు పొలంలోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం చేపట్టింది. తాలూకాలోని ప్రజలు టీకాలు వేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్న తరుణంలోవారిలోని అనుమానాలను పొగొట్టి ధైర్యం నింపి వారి ని టీకాలు వేశారు. సుమారు 50 మంది వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్‌ వేశారు.  


బళ్లారి 19వ వార్డులో... : స్థానిక డీఏఆర్‌ పోలీస్‌ లైన్‌లోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కార్పొరేటర్‌ అశోక్‌ కుమార్‌, వార్డు మహానగర పాలికె సభ్యుడు అశోక్‌ కుమార్‌, బీజేపీ నగర మాద్యమ సంచాలకుడు రాజీవ్‌ సిందిగి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T18:27:05+05:30 IST