దేశంలో 156.02 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-15T22:07:12+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను ఆయుధంగా ప్రయోగిస్తోంది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ నిర్వహిస్తోంది.

దేశంలో 156.02 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను ఆయుధంగా ప్రయోగిస్తోంది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో 156.02 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ జరిగినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 94.83 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 6,041 ఒమైక్రాన్ కేసులుగా తేలినట్టు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,17,820 కాగా పాజిటివిటీ రేట్ 12.84 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-15T22:07:12+05:30 IST