దేశంలో 160.43 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-21T20:30:10+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రకమాన్ని చేపట్టింది.

దేశంలో 160.43 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రకమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకూ దేశంలో 160.43 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825 కాగా రికవరీ రేట్ 93.50 పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 2,51,777 మంది రికవరీ కాగా మొత్తం రికవరీ సంఖ్య 3,60,58,806గా నమోదైంది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 కేసులు నమోదుకాగా ఇందులో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 9,692గా అధికారులు తేల్చారు. ఇక వీక్లీ పాజిటివిటీ రేట్ 16.50 శాతంగా అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 19,35,912 టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-21T20:30:10+05:30 IST