కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాక్సిన్‌.. రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-05-12T06:37:26+05:30 IST

కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేతత్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మంత్రి పువ్వాడ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాక్సిన్‌..  రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌
వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ కర్ణన్‌

 భక్తరామదాసు కళాక్షేత్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పరిశీలన  

 అధికారులకు పలు సూచనలు చేసిన పువ్వాడ 

ఖమ్మం సంక్షేమవిభాగం, మే 11: కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.  లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేతత్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మంత్రి పువ్వాడ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌కోసం వచ్చే వారు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అదనంగా వ్యాక్సినేషన్‌ సెంటర్ల పెంపుపై పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌, కమిషనర్‌ అనురాగ్‌జయంతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్‌ నీరజ, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, డీఐవో డాక్టర్‌ అలివేలు, క్యాంపు ఇంచార్జ్‌ ప్రవీణ, మెడికల్‌ సూపర్‌వైజర్లు తాళ్లూరి శ్రీకాంత్‌, డెమో సాంబశివారెడ్డి , తదితరులుపాల్గొన్నారు.


Updated Date - 2021-05-12T06:37:26+05:30 IST