మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2021-12-12T13:47:43+05:30 IST

కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’గా కొత్త రూపు సంతరించుకుని వ్యాపించను న్నదనే భయం కారణంగా రాష్ట్ర ప్రజలు వైరస్‌ నిరోధక టీకాలు వేసుకునేందుకు ఆసక్తిగా తరలివస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 50వేల కేంద్రాల వద్ద టీకాల శిబిరాలు నిర్వహించారు.

మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

                                - ‘బారులు తీరిన ప్రజలు


చెన్నై: కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’గా కొత్త రూపు సంతరించుకుని వ్యాపించను న్నదనే భయం కారణంగా రాష్ట్ర ప్రజలు వైరస్‌ నిరోధక టీకాలు వేసుకునేందుకు ఆసక్తిగా తరలివస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 50వేల కేంద్రాల వద్ద టీకాల శిబిరాలు నిర్వహించారు. స్థానిక కోడంబాక్కం జోన్‌ లోని రంగరాజపురం వద్ద ఏర్పాటైన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, టి.నగర్‌ శాసనసభ్యుడు జె.కరుణానిధి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో టీకాలు కార్యక్రమాలు ఉద్యమస్ఫూర్తిలో కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా ఇప్పటివరకు 7.54 కోట్ల మందికి టీకాలు వేసినట్టు తెలిపారు. 94.15లక్షల మందికి రెండో డోసు టీకాలు వేసినట్టు, చెన్నైలో 80 శాతం మంది మొదటి డోసు టీకాలు, 60 శాతం మంది రెండోడోసు టీకాలు వేయించుకున్నారని ఆయన చెప్పారు. ‘ఒమైక్రాన్‌’ తాకిడికి గురైన విదేశాల నుంచి విమానాలలో వచ్చే ప్రయాణికులందరికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడితే వారిని ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని ఆయన వివరించారు. నగరంలో 200ల వార్డులకు గాను 1600 కేంద్రాలలో టీకాల శిబిరాలను నిర్వహిం చారు. బహిరంగప్రదేశాలు, బస్టాపులు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు, బస్టాండులు, రైల్వేస్టేషన్ల సమీపంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, వలంటీర్లు కలిసి ప్రజలకు టీకాలు వేశారు.

Updated Date - 2021-12-12T13:47:43+05:30 IST