వారికే ప్రాధాన్యమిచ్చారు

ABN , First Publish Date - 2021-01-17T05:47:21+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు.

వారికే ప్రాధాన్యమిచ్చారు
నంద్యాలలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో టీకా వేస్తున్న దృశ్యం

  1.  తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌



నంద్యాల టౌన్‌, జనవరి 16: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలి విడతలో వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. నంద్యాలలోని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో శనివారం 33 మంది హెల్త్‌ వర్కర్లు వ్యాక్సిన్‌ వేయంచుకున్నారు. వైద్యుడు జగదీష్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేయంచుకున్న వారికి ఎటువంటి సమస్యలు రాలేదని తెలిపారు.


నంద్యాల(ఎడ్యుకేషన్‌): కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకా అందరికీ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. శనివారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను నంద్యాలలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణుడు ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలలో వంద మందికి గాను 37 మందికి టీకాలను వేయించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో అంకిరెడ్డి తెలిపారు. జిల్లా వైద్యశాల ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, బీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శిరీష, ఆసుపత్రి వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శనివారం మొదటి రోజు 50 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యురాలు సుజాతమ్మ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పరిశీలిం చారు. అహోబిలం గ్రామానికి చెందిన వైద్య, ఆరోగ్య సిబ్బంది లక్ష్మీకి మొదటి టీకా వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యారాలు సుజాత తెలిపారు. వైద్యులు ఉమాదేవి, ఆంజనేయులు, నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


నందికొట్కూరు: పట్టణంలోని కమ్యూనిటీ హెల్స్‌ సెంటర్‌లో శనివా రం కొవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్థర్‌ ప్రారంభిం చారు. మొదటి వ్యాక్సిన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిచేసే వైద్యుడు ప్రవీణ్‌కుమార్‌కు వేశారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో వెంకట రమణ, మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ రాయు డు, సీఐ నాగరాజారావు, ఎంపీడీవోలు క్యాథరిన్‌, గౌరీదేవి పాల్గొన్నారు. 


ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని సీహెచ్‌సీలో కరోనా వాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. శనివారం 47 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్‌.వెంకటరమణ తొలి వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శ్రీశైలం నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో వెంకటరమణల పరిశీలించారు. తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంఈవో జానకీరామ్‌, కొట్టాలచెరువు, బైర్లూటి పీహెచ్‌సీల వైద్యాధికారులు మోతిలాల్‌నాయక్‌, పవన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


బనగానపల్లె: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజు వెబ్‌సైట్‌ సమస్యల కారణంగా కేవలం 33 మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ వేసినట్లు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్‌ డాక్టర్‌ సుజాత తెలిపారు. తొలి వ్యాక్సిన్‌ను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌ సుజాతకు వేశారు. 5 రోజుల పాటు హెల్త్‌ సిబ్బందికి వాక్సిన్‌ టీకాను వేయనున్నట్లు నియోజకవర్గం స్పెషల్‌ అధికారి రమణయ్య తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తహసీల్దారు ఆల్‌ఫ్రెడ్‌, బనగానపల్లె నియోజకవర్గం స్పెషల్‌ అధికారి డాక్టర్‌ రమణయ్య, సూపరిండెంట్‌ డాక్టర్‌ సుజాత, పరిశీలించారు. టంగుటూరు, పలుకూరు పీహెచ్‌సీల వైద్యులు డాక్టర్‌ శివశంకరుడు, డాక్టర్‌ భారతి, హెల్త్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


పాణ్యం: పాణ్యంలోని సీహెచ్‌సీలో వంద మంది వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ టీకాలు వేశారు. మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాణ్యం నియోజకవర్గ ప్రత్యేక అఽధికారి వెంకటసుబ్బయ్య, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్‌ చంద్రారావు, తహసీల్దారు రత్నరాఽధిక, ఎంపీడీవో దస్తగిరి, డాక్టర్‌ మల్లికార్జున రెడ్డి, డాక్టర్‌ భగవాన్‌దాస్‌, డాక్టర్‌ రహేలా, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, డాక్టర్‌ మునిస్వామి, డాక్టర్‌ గురుకుమార్‌, స్టాఫ్‌ నర్స్‌ శైలజ, ఎస్‌ఐ రాకేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతి, మాజీ సర్పంచ్‌ సుబ్బరాయుడు, కరుణాకరరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T05:47:21+05:30 IST