టీకా కోసం.. రగడ!

ABN , First Publish Date - 2021-05-08T05:51:31+05:30 IST

పట్టణంలోని పాలపాడు రోడ్డు అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ వద్ద వాక్సిన్‌ కోసం శుక్రవారం తోపులాటలు జరిగాయి. దాదాపు 3 గంటలపాటు ఈ పరిస్ధితి ఏర్పడింది.

టీకా కోసం.. రగడ!
నరసరావుపేటలోని ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద వాక్సిన్‌ కోసం తోపులాట దృశ్యాలు

నరసరావుపేటలోని వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద తోపులాట

చేతులెత్తేసిన అధికారులు

 

నరసరావుపేట, మే 7: పట్టణంలోని పాలపాడు రోడ్డు అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ వద్ద వాక్సిన్‌ కోసం శుక్రవారం తోపులాటలు జరిగాయి. దాదాపు 3 గంటలపాటు ఈ పరిస్ధితి ఏర్పడింది. ఈ వ్యాక్సిన్‌ కేంద్రానికి 400 డోసుల కొవాక్సిన్‌ సరఫరా చేశారు. గత నెల 30 నుంచి ఈ వాక్సిన్‌ లేకపోవడం, రెండో డోసు గడువు దాటుతుండంతో ఒక్కసారి వాక్సిన్‌ కోసం వందల సంఖ్యలో ఎగబడ్డారు. ఉదయం 7 గంట నుంచే బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి అక్కడకు చేరుకని పరిస్థితిని సమీక్షించారు. వారి ఆదేశాలు కూడా లక్ష్య పెట్టకపోవడంతో మిన్నకున్నారు. పరిస్థితిని నియంత్రించలేక వారు వెనుదిరిగి వెళ్ళడం గమనార్హం. అనంతరం సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ మాట్లాడుతూ పట్టణంలో ఇక నుంచి కొవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి వాక్సిన్‌ అందిస్తామన్నారు. శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.  ఏ ప్రాంతంలో ఎంతమందికి ఏ విధమైన వ్యాక్సిన్‌ ఇస్తారో ముందుగా తెలియజేస్తామని చెప్పారు. వాక్సిన్‌ వేసే ప్రాంతం విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకునామన్నారు.  ప్రజలు ఆందోణన చెందకుండా సమన్వయంతో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సూచించారు.  


Updated Date - 2021-05-08T05:51:31+05:30 IST