కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-12-04T05:02:43+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా నివారించడానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల ని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

 తొలిదశలో హెల్త్‌వర్కర్లు, అంగన్వాడీలకు వ్యాక్సిన్‌ : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 3:  కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా నివారించడానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు  అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల ని జిల్లా  కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి దశ లో హెల్త్‌ వర్కర్లకు, అంగన్వాడీలకు, శానిటరీ వర్కర్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌  ఇచ్చేందుకు గురువారం కలెక్టర్‌ ఛాంబరులో జిల్లా టాస్క్‌ ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ  సంధర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  త్వరలో కొవిడ్‌-19 నియంత్రణకు వ్యాక్సిన్‌ రానున్నదని, మొదటి దశలో జిల్లాలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లు, శానిటరు వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయడానికి గానూ పక్కాగా డేటా భేస్‌ను రూపొందించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎంత మంది ఉన్నారో అందుకు అవసరమైన వ్యాక్సిన్‌ మోతాదు, వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రాంతం, నిల్వ ఉంచేందుకు కోల్డ్‌ చైన్‌ మెయింటెనెన్స్‌ తదితర అంశాలపై ముఽందస్తు ప్రణాళికలు సిద్ధ్దం చేసుకోవాలన్నారు. కొవిడ్‌ -19కు సంబందించి జిల్లాలో ప్రాంతీయ వ్యాక్సిన్‌ స్టోర్‌ ఏర్పాటు చేస్తారని, అలాగే జిల్లా స్థాయిలో కూడా వ్యాక్సిన్‌ స్టోర్‌ ఉంటుందన్నారు. ప్రాంతీయ స్టోర్‌ నుంచి అవసరమైతే వ్యాక్సిన్‌ను నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు  రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వ్యాక్సిన్‌ రవాణా చేసేందుకు గానూ ట్రాన్సోఫోర్టు ప్లాన్‌ను పక్కాగా సిద్ధం చేసుకోవాలన్నారు.  మొదటి దశ తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు, మూడు దశల్లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు  ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, డీఐఓ డాక్టర్‌ మల్లేశ్వరీ, కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ నాగరాజు, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామిరెడ్డి, ఐసీడీసీ పీడీ పద్మజ, అధికారులు రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్‌ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2020-12-04T05:02:43+05:30 IST