వ్యాక్సిన్‌ పట్ల భయం అవసరం లేదు{ జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌

ABN , First Publish Date - 2021-01-17T04:33:18+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు భయపడాల్సిన పని లేదని ధైర్యంగా ఉండాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ భరోసా ఇచ్చారు.

వ్యాక్సిన్‌ పట్ల భయం అవసరం లేదు{  జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌

 మధిర, సత్తుపల్లి, బోనకల్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

 ఆనందం వ్యక్తం చేసిన టీకా తీసుకున్నవారు

బోనకల్‌/సత్తుపల్లి/మధిరటౌన్‌ జనవరి 16: కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు భయపడాల్సిన పని లేదని ధైర్యంగా ఉండాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ భరోసా ఇచ్చారు. బోనకల్‌ పీహెచ్‌సీలో శనివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంబించారు. తొలి టీకాను కలకోట అంగన్‌వాడీ టీచర్‌ ప్రసాద్‌బాయికి వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 5 కేంద్రాలను వ్యాక్సినేషన్‌ పంపిణీకి ఎంపిక చేయగా అందులో బోనకల్‌ ఉండటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ పని చేసే వైద్యాధికారి శ్రీకాంత్‌ పీహెచ్‌సీని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నందు వలనే తొలి విడతలోనే కేంద్రం వచ్చిందని తెలిపారు. కరోనా రహిత సమాజాన్ని నిర్మించేందుకు వ్యాక్సినేషన్‌ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. టీకా పంపిణీ పై ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అందరూ పాజిటివ్‌గా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జడ్పీటీసీ మోదుగు సుదీర్‌, ఎంపీపీ కొంకణాల సౌభాగ్యం, సర్పంచ్‌ భూక్యా సైదా నాయక్‌, సొసైటీ చైర్మన్‌ చావా వెంకటేశ్వరావు, ఎంపీటీసీ గుగులోతు రమేష్‌, తహసీల్దార్‌ రాధిక, ఎంపీడీవో శ్రీదేవి, ఎస్‌ఐ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

బోనకల్‌: బోనకల్‌ పీహెచ్‌సీలో శనివారం నిర్వహించిన తొలి విడత కరొనా వ్యాక్సిన్‌ కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 189 మందికి వ్యాక్సినేషన్‌ లక్ష్యం కాగా తొలిరోజు 30 మందికి వేశారు. ఎలాంటి దుష్ప్రబావాలు లేక పోవడంతో వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత అందరూ ఇళ్లకు వెళ్లారు. టీకాలకు 13 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను ఎంపిక చేయగా ఒక్కరు అనారోగ్య కారణాల వల్ల రాలేదు. ఆమె స్థానంలో నారాయణపురం ఆశా కార్యకర్త సరోజిని టీకా వేయించుకున్నారు.


తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతం


సత్తుపల్లి: కరోనా వ్యాక్సిన్‌ టీకాను తొలిరోజు శనివారం ప్రభుత్వ వైద్యులు కిరణ్‌కుమార్‌ వేయించుకున్నారు. స్థానిక సీహెచ్‌సీలో ఉదయం 11.30కు మొదలవ్వగా 30మంది సీహెచ్‌సీ సిబ్బంది టీకాను వేయించుకున్నారు. ముందుగా గంగారం పీహెచ్‌సీ నుంచి కొవాగ్జిన్‌ టీకాను పోలీస్‌ ప్యాట్రాలింగ్‌ రక్షణలో సీహెచ్‌సీకి వచ్చింది. వ్యాక్సిన్‌ వేసుకున్నా భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరిగా పాటించాలని మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ సూచించారు. కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ సంపత్‌కుమార్‌, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సర్పంచ్‌లు వొగ్గు విజయలక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కంచర్ల రమాదేవి నాగేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ కే.సుజాత, స్పెషలాఫీసర్‌ ధనరాజ్‌, ఎంపీడీవో సుభాషిణీ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వసుమతీదేవి, గంగారం పీహెచ్‌సీ వైద్యులు చింతా కిరణ్‌కుమార్‌, వైద్యులు శివకృష్ణ, నరసింహారావు, గిర్దావర్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మధిరటౌన్‌: మధిర సివిల్‌ ఆసుపత్రిలో శనివారం 30 మందికి కరోనా టీకా వేయగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. టీకా తీసుకున్న వారిలో ముగ్గురు డాక్టర్లు, 8మంది ఆశా కార్యకర్తలు, 6గురు నర్సులు, 7గురు నాలుగో తరగతి ఉద్యోగులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియయన్‌లు, 4గురు ఏఎన్‌ఎం లు ఒక పార్మసి్‌స్ట, ఒక సూపర్‌ వైజర్‌ఉన్నారు. టీకా తీసుకున్న అందరూ ఆరోగ్యం గానే ఉన్నారు. 


Updated Date - 2021-01-17T04:33:18+05:30 IST