సబ్‌ డివిజన్‌లో 8 ఆస్పత్రులలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ : సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-04T05:21:52+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొంద డానికి 65ఏళ్లు, 49 వయస్సు దాటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చునని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు.

సబ్‌ డివిజన్‌లో 8 ఆస్పత్రులలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ : సబ్‌ కలెక్టర్‌

నరసాపురం టౌన్‌, మార్చి 3: కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొంద డానికి 65ఏళ్లు, 49 వయస్సు దాటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చునని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు. కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మొబైల్‌, ఆరోగ్యసేతు యాప్‌ల ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వలంటీర్ల సహకారం తీసుకుని పేర్లను, ఏ తేదిన వ్యాక్సిన్‌ వేయించుకుంటామన్న విషయాన్ని కూడా నమోదు చేసు కోవచ్చన్నారు. సబ్‌ డివిజన్‌లో బీమవరం వర్మ అస్పత్రి, వీరవాసరం, ఉండి, మొగల్తూరు, పాలకోడేరు, నరసాపు రం, గొల్లవానితిప్ప, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-03-04T05:21:52+05:30 IST