వ్యాక్సిన్ ధరల వ్యత్యాసం: భారత్‌లో అత్యల్పం... చైనాలో అత్యధికం!

ABN , First Publish Date - 2021-03-03T12:06:20+05:30 IST

కరోనా మహమ్మారితో యుద్ధం చేసేందుకు ప్రపంచంలోని...

వ్యాక్సిన్ ధరల వ్యత్యాసం: భారత్‌లో అత్యల్పం... చైనాలో అత్యధికం!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో యుద్ధం చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేశాయి. తమ దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని అన్ని దేశాలు తాపత్రయ పడుతున్నాయి. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని భావిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లు ఆ దేశంలోని ప్రజలందరికీ చేరువ కాలేని విధంగా ఉన్నాయి. దీనికి వాటి ధరలే ప్రధాన కారణంగా నిలిచాయి.


ధరల ప్రకారం చూస్తే భారత్‌లోనే అత్యంత తక్కువ ధరకు వ్యాక్సిన్ లభిస్తోంది. ఇంతేకాదు భారత్ అత్యంత తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కరోనా వ్యాక్సిన్ తయారీకి చైనా చాలా సమయం తీసుకుంది. పలు ఉత్పత్తులను అత్యంత తక్కువ ధరకు అందించే చైనా... వ్యాక్సిన్‌ను అత్యంత తక్కువ ధరకు తయారు చేయలేకపోయింది. ప్రపంచంలో తయారైన అన్ని కరోనా వ్యాక్సిన్లలో చైనా వ్యాక్సిన్ అత్యంత ఖరీదైనది. భారత్‌తో చైనా వ్యాక్సిన్ ధర పోల్చిచూస్తే... ఇక్కడ కన్నా చైనా వ్యాక్సిన్ ధర 9 రెట్లు అధికం. భారత్‌లో తయారైన రెండు వ్యాక్సిన్లు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. కోవీషీల్డ్ వ్యాక్సిన్ ప్రతీ డోసు రూ. 250 కాగా, దీనిలో వ్యాక్సిన్ ధర రూ. 150, సర్వీస్ ఛార్జి రూ. 100. ఈ ధరలకు భారత్‌లోని ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రపంచంలోని 9 దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో విజయవంతమయ్యాయి. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ‘కరోనా వ్యాక్’ ధర రూ. 2,200గా ఉంది. ఈ వ్యాక్సిన్‌ను చైనా కంపెనీ సైనోవ్యాక్ తయారు చేసింది. అమెరికా తయారు చేసిన బీఎన్టీ-162 వ్యాక్సిన్ ధర భారత కరెన్సీలో రూ1,400గా ఉంది. దీనిని అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తయారు చేసింది. యూరోపియన్ యూనియన్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఎ-1273 ధర ప్రతీ డోసు రూ. 1,300గా ఉంది. ఇక రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ధర రూ. 730గా ఉంది. బ్రెజిల్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ధర రూ.370గా ఉంది.

Updated Date - 2021-03-03T12:06:20+05:30 IST