COVID vaccine: సమస్యలు,మరణ ప్రమాదాలను తగ్గిస్తోంది

ABN , First Publish Date - 2021-08-13T17:40:14+05:30 IST

కొవిడ్ వ్యాక్సిన్ ఆరోగ్య సమస్యలు, మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు....

COVID vaccine: సమస్యలు,మరణ ప్రమాదాలను తగ్గిస్తోంది

డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడి

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ ఆరోగ్య సమస్యలు, మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. విభిన్న వేరియంట్ లకు వ్యతిరేకంగా కొవిడ్ టీకాలు సంపూర్ణ రక్షణ కల్పించలేకపోయినప్పటికీ, ఇవి మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని సౌమ్యా తెలిపారు.రాబోయే నెలలో ప్రజలు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన అనేక అంశాలు, ఇతర సమస్యలపై చర్చించారు.‘‘కరోనా వైరస్ యొక్క విభిన్న వైవిధ్యాలకు వ్యతిరేకంగా టీకా సంపూర్ణ రక్షణను అందించలేకపోయినప్పటికీ, ఇది ఖచ్చితంగా మరణం , ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంద’’ అని స్వామినాథన్‌ చెప్పారు.


Updated Date - 2021-08-13T17:40:14+05:30 IST