జొన్నతాళికి వచ్చిన టీకాలు వేరే చోటుకు..!

ABN , First Publish Date - 2021-05-06T06:47:32+05:30 IST

మార్టూరు మండలం జొ న్నతాళి గ్రామంలో బుధవారం కరోనా రెండో డో సు కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థులకు కొం చెంసేపు ఉత్కంఠ సన్నివేశం ఎదురైంది. గ్రామానికి వచ్చిన టీకాలను ఇతరులకు వేయడంపై విమర్శలు వెల్లువెతాయి. అనంతరం రెండు గం టల తర్వాత దాదాపు 50 మందికి పైగా టీకా వేశారు.

జొన్నతాళికి వచ్చిన టీకాలు వేరే చోటుకు..!

మార్టూరు, మే 5 : మార్టూరు మండలం జొ న్నతాళి గ్రామంలో బుధవారం కరోనా రెండో డో సు కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థులకు కొం చెంసేపు ఉత్కంఠ సన్నివేశం ఎదురైంది. గ్రామానికి వచ్చిన టీకాలను ఇతరులకు వేయడంపై విమర్శలు వెల్లువెతాయి. అనంతరం రెండు గం టల తర్వాత దాదాపు 50 మందికి పైగా టీకా వేశారు. వివరాల్లోకెళ్తే... జొన్నతాళి గ్రామ సచివా లయంలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి చెంది న ఓ మహిళ ఉదయం వారి పరిధిలో ఉన్న ద్రో ణాదుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీకా లు తీసుకున్నారు. దాదాపు 7 వైల్స్‌ను ఆమె తీ సుకున్నట్లు సమాచారం. ఆ మహిళ టీకాలను గ్రామానికి తీసుకురాకుండా, తనకు పరిచయం ఉన్న నరసరావుపేట, సత్తెనపల్లికు చెందిన సు మారు 30 మందికి మార్టూరులో టీకాలు వేసి నట్లు తెలిసింది. ఈ సమయంలో గ్రామంలో టీ కాలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సదరు మహిళకు ఫోన్‌ చేయగా సరైన జవాబు రాలే దు. అది కాకుండా ఉదయం 9 గంటల సమ యంలో నరసరావుపేట, సత్తెనపల్లికి చెందిన కొంతమంది వాహనాల్లో గ్రామ సచివాలయానికి టీకా కోసం వచ్చారు. వారిని గుర్తించిన గ్రామ స్థులు వాగ్వావాదానికి దిగినట్లు తెలిసింది. ఇది లా ఉండగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత సచివాలయం వద్దకు వాక్సిన్‌తో ఆ మహిళ రాగా, అప్పటికే ఈ విషయంపై సమాచారం అందుకొన్న ద్రోణాదుల వైద్యసిబ్బంది జొన్నతాళి గ్రామం వచ్చి వేరే సిబ్బంది చేత ప్రజలకు టీకా వేశారు. అప్పటికే 3 వైల్స్‌ అయిపోగా మిగిలిన 4 వైల్స్‌లో టీకాలను వేశారు. ఈ విషయమై వై ద్యాఽధికారి కవిత అనసూయను ఆంధ్రజ్యోతి సం ప్రదించగా ఈ విషయమై జిల్లా అధికారులను సంప్రదించాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఎం హెచ్‌వో మాధవీలతను ఫోన్‌లో సంప్రదించగా తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. కాగా ఈ వి షయమై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేస్తానని వై ద్యురాలు చెప్పారు.

గ్రామస్థులు ఫిర్యాదు చేశారు

టీకా ఇతరులకు వేసిన విషయమై గ్రామస్థు లు ఏఎన్‌ఎం హరితపై ఫిర్యాదు చేశారు. విచా రణ చేసి కలెక్టర్‌కు నివేదికను పంపిస్తా. 

- ఈదా వెంకటరెడ్డి, తహసీల్దారు


Updated Date - 2021-05-06T06:47:32+05:30 IST