2022లో కొత్త కొవిడ్‌ టీకాలు వాడాల్సి రావచ్చు : జర్మనీ నిపుణుడు

ABN , First Publish Date - 2021-05-17T09:44:58+05:30 IST

ఈ సంవత్సరం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు.. వచ్చే ఏడాది (2022 సంవత్సరం) కూడా బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సి రావచ్చని జర్మనీకి చెందిన స్వతంత్ర వ్యాక్సిన్‌ సలహా కమిటీ సారథి థామస్‌ మెర్టెన్స్‌ వ్యాఖ్యానించారు.

2022లో కొత్త కొవిడ్‌ టీకాలు వాడాల్సి రావచ్చు : జర్మనీ నిపుణుడు

బెర్లిన్‌: ఈ సంవత్సరం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు.. వచ్చే ఏడాది (2022 సంవత్సరం) కూడా బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సి రావచ్చని జర్మనీకి చెందిన స్వతంత్ర వ్యాక్సిన్‌ సలహా కమిటీ సారథి థామస్‌ మెర్టెన్స్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్‌తో తమ పని పూర్తయిందని అధికార యంత్రాంగం భావించొద్దు. కొన్ని నెలల తర్వాత.. టీకా లబ్ధిదారుల్లో రోగ నిరోధక ప్రతిస్పందన కొనసాగుతోందా ? లేదా ? అనేది తెలుసుకోవాలి. వైరస్‌ మనల్ని వదిలే దాఖలాలు కనిపించడం లేదు. ఇదే జరిగితే మార్పులు చేసిన కొత్త కరోనా టీకాలను 2022 సంవత్సరంలో ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-05-17T09:44:58+05:30 IST