Abn logo
Jun 11 2021 @ 13:28PM

ఏపీలో కొవిడ్ బాధితులకు రూ.17 కోట్ల సాయం అందింది: అర్జా శ్రీకాంత్

అమరావతి: ఏపీలో కొవిడ్ బాధితులకు రూ.17 కోట్ల మేర సాయమందిందని కొవిడ్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ పేర్కొన్నారు. మరో రూ.18 కోట్ల మేర సాయమందించేందుకు ముందుకొస్తున్నారు. పలు సంస్థలు, వ్యక్తుల ధాతృత్వం ప్రశంసనీయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు ముందుకు రావాలన్నారు. సాయమందించడంలో ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయమందిస్తున్నారన్నారు.


Advertisement
Advertisement
Advertisement