Abn logo
Jun 2 2021 @ 11:43AM

కరోనా నివారణకు గ్రామదేవతకు పూజలు


బళ్లారి(కర్ణాటక): గ్రామాలలో కరోనా వైరస్‌ తగ్గాలని ప్రార్థిస్తూ తాలూకాలోని వివిధ ఆలయాల్లో గ్రామదేవతలు పూజలు నిర్వహించారు. తాలూకాలోని నాగేనహళ్ళి గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామదేవత సుంకలమ్మ దేవి విగ్రహానికి విశేష పూజలు జరిపించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బచ్చాలు(ఓళిగె) అర్పించడం జరిగింది. గ్రామంలో చుట్టూ వేప ఆకుల తోరణాల కట్టారు. పూజలో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.