తుని ఆస్పత్రిలో ‘కొవిడ్‌’ వార్డు

ABN , First Publish Date - 2020-08-09T11:23:36+05:30 IST

తుని ఏరియా ఆస్పత్రిలో అక్సిజన్‌ కొవిడ్‌ బెర్త్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

తుని ఆస్పత్రిలో ‘కొవిడ్‌’ వార్డు

తుని, ఆగస్టు 8: తుని ఏరియా ఆస్పత్రిలో అక్సిజన్‌ కొవిడ్‌ బెర్త్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడం వల్ల ఏరియా ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌తో కూడిన కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


  తుని, అమలాపురం, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రులతో పాటు నాలుగు కమ్యూనిటీ సెంటర్లలో ఆక్సిజన్‌ కొవిడ్‌ బెర్తులను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే భయపడాల్సిన పనిలేదని, వైద్యుల సలహాల మేరకు చికిత్స పొంది పది రోజుల్లో ఇంటికి వెళ్లవచ్చునని తెలిపారు. అనంతరం కరోనా టెస్ట్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులకు యథావిధిగా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.  ఆర్డీవో మల్లిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విష్ణువర్థని, కరోనా నోడల్‌ అధికారి శశికళ, డాక్టర్లు దొర, మహేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రాజు, ఇన్‌చార్జి తహశీల్దార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:23:36+05:30 IST