కొవిడ్-19 ప్లాస్మా థెరపీపై కీలక విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2020-06-03T21:31:57+05:30 IST

కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను ఉపయోగించి కరోనా వైరస్ బారిన పడిన ...

కొవిడ్-19 ప్లాస్మా థెరపీపై కీలక విషయాలు వెలుగులోకి..

హూస్టన్: కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను ఉపయోగించి కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వాటిల్లవని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ ఫలితాలతో నోవెల్ కరోనా వైరస్‌కు గురైన వారికి అందించే చికిత్స ప్రక్రియలో మరిన్ని మార్పులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రి పరిశోధకులు మార్చి 28న ప్లాస్మా చికిత్సపై క్లినికల్ ట్రయన్స్ ప్రారంభించారు. తీవ్రమైన కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి ప్రయోగాలు చేపట్టినట్టు సదరు నివేదికలో పేర్కొన్నారు. ఈ విధానంలో మొత్తం 25 మందికి వైద్యం అందించగా ఇప్పటి వరకు 19 మంది కోలుకున్నారనీ.. అందులో ఇప్పటికే 11 మంది డిశ్చార్జ్ అయ్యారని పరిశోధకులు ఓ జర్నల్‌లో పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకు కరోనా వ్యాధికి స్పష్టమైన చికిత్సా విధానం లేదనందున.. మానవాళి చరిత్రలో మరింత వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఇది..’’ వారు చెబుతున్నారు. 

Updated Date - 2020-06-03T21:31:57+05:30 IST