కోవిడ్ టీకా కోసం స్లాట్ల బుకింగ్
ABN , First Publish Date - 2021-05-12T22:49:01+05:30 IST
కోవిడ్ టీకా కోసం స్లాట్ల బుకింగ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా హర్యానా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్‌లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కోవిడ్ -19 టీకా స్లాట్లను బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. గురుగ్రామ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ -19 టీకాలు వేయడానికి బుకింగ్ స్లాట్లలో సమస్యలపై ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.