ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలి: CP anjani kumar

ABN , First Publish Date - 2021-10-19T19:35:38+05:30 IST

ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలని... వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలి: CP anjani kumar

హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలని... వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు 1000 బైక్ సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించినట్లు తెలిపారు. వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ గాని ఏ విధంగా ఉండాలి అనేది రీసెర్చ్ చేసిన తర్వాత బైక్‌ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నారు. సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతూ తిరుగుతున్నారని తెలిపారు. రోడ్లపై వెళ్లే వారికి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల అనారోగ్యానికి గురై హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మెట్రో నగరం ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా అందరం సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేసేలా భాగస్వాములం అవుదామని సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-19T19:35:38+05:30 IST