50 శాతం ఫేక్ కాల్స్ వస్తుంటాయి: సీపీ అంజనీకుమార్

ABN , First Publish Date - 2021-12-01T21:41:58+05:30 IST

నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. 123పెట్రోలింగ్ కార్స్, 251 బ్లూకోట్స్ వెకిల్స్ ఉన్నాయని తెలిపారు.

50 శాతం ఫేక్ కాల్స్ వస్తుంటాయి: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. 123పెట్రోలింగ్ కార్స్, 251 బ్లూకోట్స్ వెకిల్స్ ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి 5నిమిషాలలో చేరుకుంటాయన్నారు. 119 రౌడీసీటర్స్ చెకింగ్ పాయింట్స్... 253( ఎం ఓ)  చెకింగ్ పాయింట్స్ ప్రతి రోజు పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా పోలీస్ సిబ్బంది చెక్ చేస్తారని పేర్కొన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను  కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరియవేక్షణ నిరంతరం కొనసాగుతుందన్నారు. లాస్ట్ మంత్‌లో 18వేల 7వందల డియల్స్  కాల్స్ వచ్చాయన్నారు. డియల్ కాల్స్‌లో 50శాతం ఫేక్ కాల్స్ వస్తుంటాయని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-01T21:41:58+05:30 IST